![]() |
![]() |

శ్రీముఖి.. టెలివిజన్ రంగంలో యాంకరింగ్ తో తన సత్తా చాటుతుంది. టీవిరంగంలోనే కాకుండా సినిమాలల్లో కూడా నటిస్తుంది శ్రీముఖి. బిగ్ బాస్ సీజన్-3 లో రన్నరప్ గా నిలిచింది. బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక సినిమాల్లో వరుస ఆఫర్స్ తో బిజీ అయింది శ్రీముఖి.
జులాయి సినిమాలో అల్లు అర్జున్ కి చెల్లెలు పాత్రలో కనిపించిన శ్రీముఖి.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. బిబి జోడీలో యాంకర్ గా చేసిన శ్రీముఖి పలు టీవి షోస్ , ఆడియో ఫంక్షన్స్ తో గుర్తింపు తెచ్చుకుంటుంది. అయితే తన హాట్ ఫోటోస్ ని ఈ మధ్య తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అవి కాస్త వైరల్ గా మారాయి. అయితే తనకి సంబంధించిన ప్రతీ అప్డేట్ ని అటు యూట్యూబ్ లో వ్లాగ్ లుగా చేసి అప్లోడ్ చేస్తుంది. అయితే శ్రీముఖి తన పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకోవడానికి థాయ్ లాండ్ వెళ్ళింది.
థాయ్ లాండ్ కి వెళ్ళిన శ్రీముఖి తన యూట్యూబ్ ఛానెల్ లో వరుసగా వ్లాగ్ లు చేస్తుంది. కాగా తాజాగా 'బర్త్ డే ఆన్ ప్రైవేట్ యాచ్' అనే టైటిల్ తో వీడీయోని అప్లోడ్ చేసింది. ఇందులో సముద్రపు మధ్యలో తన బర్త్ డే ని ఫ్రూట్స్ తో చేసిన కేక్ ని కట్ చేసింది శ్రీముఖి. ఆ తర్వాత థాయ్ లాండ్ లోని పుకెట్ లో తను ఎలా గడిపిందో వివరిస్తూ, అంతా ఒక అద్భుతమమని చెప్పింది. ఇలా అక్కడ తన జర్నీ ఎలా సాగిందో వివరించింది. కాగా శ్రీముఖి అప్లోడ్ చేసిన ఈ వీడియోకి మంచి వీక్షకాధరణ లభిస్తుంది.
![]() |
![]() |